Header Banner

ప‌ర‌గ‌డుపునే ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు! అవేమిటో తెలుసా?

  Thu Feb 20, 2025 09:00        Health

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌న రోజును ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌తో ప్రారంభించాలి. ఉద‌యాన్నే అనారోగ్య‌క‌ర‌మైన ఆహారాలను తింటే ఆ రోజంతా మ‌న‌కు ఏదో ఒక స‌మ‌స్య వ‌స్తుంది. అలాగే పొట్ట‌లో అసౌక‌ర్యం కూడా ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. దీంతోపాటు శ‌రీరంలో క్యాల‌రీలు చేరి బ‌రువు పెరుగుతారు. ఇది ఇత‌ర వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతుంది. క‌నుక ఉద‌యం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తినాల్సి ఉంటుంది. అయితే కొంద‌రు తెలియ‌క ఉద‌యం పూట ప‌లు ఆహారాల‌ను ఖాళీ క‌డుపుతో తింటుంటారు. ఇవి పొట్ట‌లో అసౌక‌ర్యంతోపాటు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను, ఇత‌ర అనారోగ్యాల‌ను క‌ల‌గ‌జేస్తాయి. ఈ క్ర‌మంలోనే ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉద‌యం ఖాళీ క‌డుపుతో తీసుకోకూడ‌ద‌ని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

సిట్ర‌స్ పండ్లు, టీ, కాఫీ..
నిమ్మ‌, నారింజ‌, ద్రాక్ష‌, పైనాపిల్ వంటి పండ్ల‌లో విట‌మిన్ సితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇవి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. అయితే ఉద‌యం ఖాళీ క‌డుపుతో మాత్రం ఈ పండ్ల‌ను తిన‌కూడ‌దు. ఇవి జీర్ణాశ‌యంలో అధికంగా ఆమ్లాలు ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తాయి. దీంతో క‌డుపులో మంట‌, గుండెల్లో మంట‌, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాబ‌ట్టి ఖాళీ క‌డుపుతో వీటిని తిన‌కూడ‌దు. అలాగే టీ లేదా కాఫీని కూడా ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగ‌కూడ‌దు. చాలా మంది ఉద‌యం నిద్ర లేవ‌గానే ప‌ర‌గ‌డుపునే వీటిని సేవిస్తుంటారు. ఇలా ఖాళీ క‌డుపుతో వీటిని తాగ‌డం మంచిది కాదు. ఇవి యాసిడ్లు అధికంగా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తాయి. దీంతో క‌డుపులో మంట పెరుగుతుంది. పొట్ట‌లో అసౌక‌ర్యం ఏర్ప‌డుతుంది. క‌నుక టీ, కాఫీల‌ను కూడా ప‌ర‌గ‌డుపున సేవించ‌డం మానేయాలి. 

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

తియ్య‌ని ఆహారాలు, ప‌చ్చి కూర‌గాయ‌లు..
ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తీపి ప‌దార్థాలు లేదా చ‌క్కెర అధికంగా ఉండే ప‌దార్థాల‌ను, పిండి ప‌దార్థాల‌ను అధికంగా తిన‌రాదు. ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అమాంతం పెంచుతాయి. దీంతో శ‌రీరం ఆ ఆహారాల‌ను జీర్ణం చేసేందుకు శ్ర‌మిస్తుంది. ఫ‌లితంగా బ‌ద్ద‌కంగా అనిపిస్తుంది. ఉద‌యం నుంచే యాక్టివ్‌గా ఉండ‌లేరు. ఏ ప‌ని చేయాల‌నిపించ‌దు. అదేవిధంగా ప‌చ్చి కూర‌గాయ‌ల‌ను కూడా ఖాళీ క‌డుపుతో తిన‌కూడ‌దు. వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది త్వ‌ర‌గా జీర్ణం కాదు. దీంతో అజీర్తి స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం వ‌స్తాయి. అలాగే ప‌చ్చి కూర‌గాయ‌ల్లో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. క‌నుక ప‌ర‌గ‌డుపున వీటిని తిన‌డం అంత మంచిది కాదు. 

 

కారం, మ‌సాలాలు, అర‌టి పండ్లు..
కొంద‌రు ఖాళీ క‌డుపుతో కారం, మ‌సాలాలు అధికంగా ఉండే ఆహారాల‌ను ఉద‌య‌మే తింటుంటారు. ఇలా తిన‌డం జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు చాలా హానికరం. ఇలా తింటే జీర్ణాశ‌యం, పేగుల గోడ‌లు ఆమ్ల‌త్వానికి డ్యామేజ్ అవుతాయి. దీర్ఘ‌కాలంలో ఇది అల్స‌ర్‌కు దారి తీస్తుంది. క‌నుక ఉద‌యం ప‌ర‌గ‌డుపున కారం, మ‌సాలాల‌ను తిన‌డం మంచిది కాదు. కొంద‌రు ఉద‌యం ఖాళీ క‌డుపుతో అర‌టి పండ్ల‌ను తింటుంటారు. ఇలా తిన‌డం కూడా మంచిది కాదు. దీని వ‌ల్ల శ‌రీరంలో మెగ్నిషియం, క్యాల్షియం స్థాయిలు పెరుగుతాయి. దీంతో వాటిని బ‌య‌ట‌కు పంపించ‌డం కోసం శరీరం శ్ర‌మించాల్సి వ‌స్తుంది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది. క‌నుక అర‌టి పండ్ల‌ను కూడా ప‌ర‌గ‌డుపునే తిన‌కూడ‌దు. ఇలా ప‌లు ర‌కాల ఆహారాల‌ను ఖాళీ క‌డుపుతో తిన‌డం మానేయాలి. లేదంటే లేని పోని ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న వారు అవుతారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Health #Fruits #Foods #Diet #Sleep